Ravichandran Ashwin: అశ్విన్ రిటైర్‌మెంట్‌పై భార్య ప్రీతి అశ్విన్ భావోద్వేగం.. సుధీర్ఘ నోట్ విడుదల

Prithi Ashwin took to Instagram to write a fitting tribute to her partner Ravichandran Ashwin retirement

  • ఎలా స్పందించాలో అర్థం కాలేదన్న ప్రీతి అశ్విన్
  • గత 13-14 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఎమోషనల్
  • ఇకపై కుటుంబానికి సమయం వెచ్చించాలని అశ్విన్‌కు సందేశం

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అశ్విన్ రిటైర్‌మెంట్‌పై అతడి భార్య ప్రీతి అశ్విన్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె ఒక సుధీర్ఘ నోట్‌ను విడుదల చేశారు. ఏం చెప్పాలో రెండు రోజులుగా అస్పష్టంగా ఉందని ఆమె అన్నారు. ‘‘నా ‘ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్‌’కి సంఘీభావంగా నోట్ విడుదల చేయాలా? లేక, నా భర్త కోణంలో స్పందించాలా?. లేదా ఒక అభిమానిగా లేఖ విడుదల చేయాలా?. అశ్విన్ రిటైర్‌మెంట్‌ ప్రకటించాక ఎన్నో చిన్న, పెద్ద క్షణాలు గుర్తుకొచ్చాయి. గత 13-14 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. భారీ విజయాలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో అంతా నిశ్శబ్దం’’ అని ప్రీతి అశ్విన్ పేర్కొన్నారు.

‘‘డియర్ అశ్విన్... క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా పట్టుకోవాలో తెలియని నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాల వరకు మిమ్మల్ని నేను అనుసరించాను. మిమ్మల్ని చూస్తూ నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పరిచయం చేసిన ప్రపంచం నాకు గౌరవాన్ని అందించింది. క్రికెట్‌లో రాణించేందుకు మీరు ఎంత కృషి, క్రమశిక్షణతో మెలిగారో నేను చూశాను. అవార్డులు, అత్యుత్తమ గణాంకాలు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు, ప్రశంసలు, రికార్డులు వేటినీ పట్టించుకోకుండా నైపుణ్యాలను మీరు నిరంతరం పదును పెట్టుకున్నారు. ఇకపై మీకు నచ్చిన నిబంధనల ప్రకారం నడుచుకోండి. మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. రోజంతా మీమ్స్ షేర్ చేస్తూ ఉండండి. మన పిల్లల క్రమశిక్షణను పర్యవేక్షించండి’’ అని ప్రీతి అశ్విన్ రాసుకొచ్చారు.

  • Loading...

More Telugu News