Nara Lokesh: అప్పుడే కళ్లు తెరిచిన ఆ శిశువు కష్టం చూసి తల్లడిల్లిపోయాను: మంత్రి లోకేశ్
ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగులో అప్పుడే పుట్టిన ఓ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ముళ్ల కంపల్లో వదిలేసి వెళ్లిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. "అప్పుడే కళ్లు తెరిచిన శిశువు కష్టం చూసి తల్లడిల్లిపోయాను. ముళ్ల కంపల్లో రక్తమోడుతూ కనిపించేసరికి హృదయం ద్రవించిపోయింది. శిశువు సంరక్షణ బాధ్యతలను శిశు సంక్షేమ శాఖ తీసుకుంటుంది. ఇటువంటి అమానవీయ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నాను" అని లోకేశ్ ట్వీట్ చేశారు.