Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు: శ్రియారెడ్డి

Actress Sriya Reddy heaps praise in Pawan Kalyan

  • పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ
  • సుజిత్ దర్శకత్వంలో చిత్రం
  • ఓజీలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రియారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పెండింగ్ సినిమాలు పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి శ్రియారెడ్డి తాజాగా పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

'ఓజీ' చిత్రంలో తాను, పవన్ కల్యాణ్ ఉండే కొన్ని సీన్లను చిత్రీకరించారని వెల్లడించింది. పవన్ కల్యాణ్ సెట్స్ పై ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని, అదే సమయంలో చాలా తెలివైన వ్యక్తి కూడా అని కితాబిచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని... ఆయన ప్రవర్తన, మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉంటాయని వివరించింది. ఎప్పుడూ హుందాగా ఉంటారని శ్రియారెడ్డి తెలిపింది.

Pawan Kalyan
Sriya Reddy
OG
Sujeeth
Tollywood
  • Loading...

More Telugu News