KTR: హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్న కేటీఆర్

KTR to file quash petition in High Court

  • ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదు
  • ఏ1గా కేటీఆర్ ను చేర్చిన ఏసీబీ అధికారులు
  • కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. 

నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించబోతున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఈరోజు క్వాష్ పిటిషన్ వేయనున్నారు. 

  • Loading...

More Telugu News