Tanker Blast: పెట్రోల్ పంప్ ముందు యాక్సిడెంట్.. భారీగా ఎగసిపడ్డ మంటలు.. ఐదుగురి మృతి.. వీడియో ఇదిగో!

5 Dead 35 Hurt In Huge Jaipur Fire As 2 Trucks Collide Outside Petrol Pump

  • జైపూర్ లో ఘోర ప్రమాదం.. 35 మందికి గాయాలు
  • పార్క్ చేసిన సీఎన్ జీ ట్యాంకర్ ను ఢీ కొట్టిన ట్రక్కు
  • మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చని అధికారుల వెల్లడి 

పెట్రోల్ బంక్ పక్కన పార్క్ చేసిన ట్యాంకర్ ను అదుపుతప్పిన ట్రక్కు ఒకటి ఢీ కొట్టింది. దీంతో ఆ గ్యాస్ ట్యాంకర్ పేలి మంటలు ఎగసిపడ్డాయి. పెట్రోల్ బంక్ లోకి మంటలు వ్యాపించడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికులు, అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..

అజ్మీర్ రోడ్ లోని ఓ పెట్రోల్ బంక్ ముందు సీఎన్ జీ ట్యాంకర్ పార్క్ చేసి ఉంది. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఓ ట్రక్కు అదుపుతప్పి ఈ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ట్యాంకర్ లో గ్యాస్ ఉండడంతో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల దాకా వినిపించింది. ట్యాంకర్ చుట్టూ 300 మీటర్ల పరిధిలో ఉన్న వాహనాలు, షాపులకు మంటలు అంటుకున్నాయి.

పెట్రోల్ బంక్ తో పాటు చుట్టుపక్కల పార్క్ చేసిన ట్యాంకర్లు కూడా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని వెల్లడించిన అధికారులు, మృతుల సంఖ్య పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ 35 మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News