MLC Kavitha: అన్న కేటీఆర్ పై ఏసీబీ కేసు పట్ల కవిత స్పందన

mlc kavitha reacts on case filed on ktr

  • కేటిఆర్‌పై కేసు నమోదు
  • ఎక్స్ వేదికగా స్పందించిన కేటిఆర్ సోదరి కవిత
  • శాసనసభలో సమాధానం చెప్పలేకనే కేటిఆర్‌పై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న కవిత

ఫార్ములా ఈ – కార్ రేసింగ్ ఈవెంట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రేవంత్ సర్కార్‌‌పై ఆమె ధ్వజమెత్తారు. 

సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్‌పై అక్రమంగా, కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  
 
కాంగ్రెస్ పార్టీ చర్యలు, వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తామంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ సైనికులమనే విషయాన్ని సీఎం గుర్తు పెట్టుకోవాలన్నారు. అక్రమ కేసులతో భయపెట్టలేరని అన్నారు. తాము మరింత బలపడి పోరాటాన్ని కొనసాగిస్తుంటామని తెలిపారు. తెలంగాణ స్పూర్తి గెలుస్తుందని కవిత పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News