Ramcharan: 'గేమ్ ఛేంజ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా బ‌య‌ల్దేరిన‌ రామ్‌చ‌ర‌ణ్

RamCharan is off to the USA for the Pre Release Event of Game Changer in Dallas

  • రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబోలో 'గేమ్ ఛేంజ‌ర్'
  • జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • రేపు అమెరికాలోని డ‌ల్లాస్ వేదిక‌గా మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌
  • ఈ మెగా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా సుకుమార్

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దాంతో చాలా రోజుల ముందు నుంచే చిత్రం యూనిట్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. రోజుల వ్యవధిలో వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ హైప్‌ను మరింత పెంచుతోంది. ఇప్పటికే టీజ‌ర్‌తో పాటు మూడు పాట‌లు రిలీజైన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలోని డ‌ల్లాస్ లో నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రేపు అక్కడ ఈ మెగా ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. దీనికోసం హీరో రామ్‌చ‌ర‌ణ్ అమెరికాకు ప‌య‌న‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర‌బృందం ట్వీట్ చేసింది. డ‌ల్లాస్ క‌లుద్దామంటూ పేర్కొంది. 

ఇక రేపు జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనాల్సిందిగా అమెరికాలోని తెలుగు ప్రజలను ఆహ్వానిస్తూ చెర్రీ గురువారం ఓ వీడియో సందేశాన్ని కూడా పంచుకున్నారు. టెక్సాస్‌లోని స్థానికులను ఈవెంట్‌లో పాల్గొనమని ఆహ్వానిస్తూ వీడియో క్లిప్‌ను విడుదల చేశారు.

ఈ మెగా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా సుకుమార్ 
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ అమెరికాలో నిర్వ‌హిస్తున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. రేపు డ‌ల్లాస్‌లోని క‌ర్టిస్ క‌ల్‌వెల్ సెంట‌ర్‌, 4999 నామ‌న్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టీఎక్స్ 75040 వేదిక‌గా ఈ మెగా ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. పుష్ప2తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. 

ఇక 'గేమ్ ఛేంజ‌ర్‌'లో రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. చెర్రీ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్‌ థ‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని.. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

  • Loading...

More Telugu News