Ayush: ఏపీ ఆయుష్‌లో ఎంపికైన మెడికల్ ఆఫీసర్ల ధ్రువపత్రాల పరిశీలన

ap Ayush ad press note

  • ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లకు ఈ నెల 30న ధ్రువపత్రాల పరిశీలన
  • హోమియోపతి మెడికల్ ఆఫీసర్లకు ఈ నెల 31న పరిశీలన
  • ప్రకటన విడుదల చేసిన ఆయుష్ ఉప సంచాలకులు జె. ధనుంజయరావు 

ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఏపీపీఎస్‌సీ ద్వారా ద్వారా మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద, హోమియోపతి) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, 31 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ఉప సంచాలకులు జె.ధనుంజయరావు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 10 గంటల నుంచి, హోమియోపతి మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 31న ఉదయం 10 గంటల నుంచి విజయవాడ గొల్లపూడి లోని ఆయుష్ డిపార్ట్‌మెంట్ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా ఆయన కోరారు. అర్హత పొందిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు తప్పనిసరిగా హాజరై తగిన పత్రాలను సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరికి వచ్చిన వారు జీవో ఎంఎస్ నెం. 142ని అనుసరించి తగిన పత్రాలను కూడా అదే రోజు సమర్పించాల్సి ఉంటుందని ఉప సంచాలకులు జె.ధనుంజయరావు తెలిపారు.   

Ayush
Medical Officer
Jobs
  • Loading...

More Telugu News