Priyanka Gandhi: జమిలి ఎన్నికలపై జేపీసీ.. కమిటీలో ప్రియాంకగాంధీకి చోటు

Priyanka Gandhi and Anurag Thakur to be part of 31 member JPC

  • 31 మంది సభ్యులతో జేపీసీ వేసిన కేంద్రం
  • 21 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు
  • కమిటీలో సీఎం రమేశ్, బాలశౌరి, అనురాగ్ ఠాకూర్

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 31 మందితో జేపీసీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. జేపీసీలో తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రమేశ్, వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఇటీవలే వయనాడ్ లోక్ సభ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జమిలి కోసం సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల పరిశీలన కోసం కేంద్రం జేపీసీని వేసింది.

జేపీసీలో లోక్ సభ నుంచి ఉన్న 21 మంది సభ్యుల్లో... పీపీ చౌదరి, సీఎం రమేశ్, బన్సూరి స్వరాజ్, పురుషోత్తంభాయ్ రూపాలా, అనురాగ్ సింగ్ ఠాకూర్, విష్ణుదయాల్ రామ్, భర్తృహరి మహ్తాబ్, సంబిత్ పాత్రా, అనిల్ బలూని, విష్ణు దత్త శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారి, సుఖ్‌దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కల్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, జీఎం హరీశ్ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, చందన్ చౌహాన్, బాలశౌరి వల్లభనేని ఉన్నారు. రాజ్యసభ నుంచి పది మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. 

  • Loading...

More Telugu News