Jagan: కర్నూలు పర్యటనలో జగన్.. ఫొటోలు ఇవిగో!

Jagan in Kurnool

  • వైసీపీ నేత సురేంద్ర రెడ్డి కుమార్తె రిసెప్షన్ కు హాజరైన జగన్
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత
  • కర్నూలు నుంచి తాడేపల్లికి వెళ్లనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు డాక్టర్ చతుర, డాక్టర్ నిఖిల్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ సెంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. 

బెంగళూరులో ఉన్న జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు నుంచి ఆయన తాడేపల్లికి వెళ్తారు. తాడేపల్లిలో కీలక వైసీపీ నేతలతో ఆయన భేటీ అవుతారు.

Jagan
YSRCP
  • Loading...

More Telugu News