Pawan Kalyan: జల్ జీవన్ మిషన్ లో గత వైసీపీ ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం చేసింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires onn YSRCP

  • విజయవాడలో జల్ జీవన్ మిషన్ పై వర్క్ షాప్
  • జల్ జీవన్ మిషన్ ను బలోపేతం చేస్తామన్న పవన్
  • ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందించడమే మిషన్ లక్ష్యమని వ్యాఖ్య

గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పవన్ తెలిపారు. నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని... ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయిందని చెప్పారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. 

  

  • Loading...

More Telugu News