KTR Auto: ఆటో డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కేటీఆర్.. వీడియో ఇదిగో!

KTR And BRS MLAs Reached Assemble In Auto

--


ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలను ఎక్కించుకుని కేటీఆర్ ఆటో నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఖాకీ చొక్కాలు వేసుకుని, చేతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదిలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News