Russian General: రష్యన్ జనరల్ చివరి క్షణాలు.. వీడియో ఇదిగో!

Russian Nuclear Chief Final Moments On Cam

  • చంపింది తామేనని ప్రకటించిన ఉక్రెయిన్
  • ఎస్ బీయూ ఏజెంట్లు బాంబు అమర్చారని వెల్లడి
  • తమపై రసాయనిక ఆయుధాలు ప్రయోగించినందుకేనని వివరణ

స్కూటర్ బాంబు పేలడంతో రష్యా నూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తన నివాసం నుంచి బయటకు అడుగుపెడుతుండగా బాంబు పేలింది. దీంతో కిరిల్లోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కిరిల్లోవ్, ఆయన సహాయకుడు ఇంట్లో నుంచి బయటకు రావడం, బాంబు పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.

కాగా, ఇగోర్ కిరిల్లోవ్ ను తామే హత్య చేసినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. తమ భూభాగంపై నిషేధిత రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కిరిల్లోవ్ అనుమతించారని ఆరోపించాయి. దీనికి ప్రతీకారంగానే ఆయనను తుదముట్టించినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్ బీయూ) ఏజెంట్లు మాస్కోలోని కిరిల్లోవ్ నివాసం ముందు స్కూటర్ బాంబును ప్లాంట్ చేశారని తెలిపాయి. ఈమేరకు ఎస్ బీయూ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.

  • Loading...

More Telugu News