Donald Trump: భారత్ కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Trump Threatens India With Reciprocal Tariff

  • మా వస్తువులపై మీరు పన్ను విధిస్తే మీ వస్తువులపై మేమూ టాక్స్ వేస్తామని హెచ్చరిక 
  • దిగుమతి సుంకం ఆయా దేశాల ఇష్టం.. దానికి తగినట్లుగా అమెరికా స్పందిస్తుందని వివరణ
  • భారత్, బ్రెజిల్ 100 శాతం టాక్స్ వేస్తే తామూ అంతే పన్ను విధిస్తామని హెచ్చరిక

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ మొత్తంలో పన్నులు విధిస్తున్నారని ఆరోపిస్తూ తాము కూడా అంతే మొత్తంలో పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. భారత్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు అమెరికా వస్తువులపై 100 శాతం, 200 శాతం పన్నులు విధిస్తున్నాయని చెప్పారు.

దిగుమతి చేసుకునే వస్తువులపై ఎంత శాతం పన్ను విధించాలనేది ఆయా దేశాల ఇష్టమని ట్రంప్ చెప్పారు. అయితే, అమెరికాకూ ఆ హక్కు ఉంటుందని గుర్తుచేశారు. తమ వస్తువులపై భారీగా టాక్స్ విధిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. అంతేమొత్తంలో ఆయా దేశాల వస్తువులపై పన్నులు వసూలు చేస్తామని వివరించారు. ఇతర దేశాలు అమెరికాను ఎలా ట్రీట్ చేస్తాయో అదేవిధంగా అమెరికా ఆయా దేశాలను ట్రీట్ చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News