Kollu Ravindra: పేర్ని నాని కుటుంబం మొత్తం పరారీలో ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర
- పేర్ని నాని 187 టన్నుల బియ్యం తినేశారన్న కొల్లు రవీంద్ర
- చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య
- పేర్ని నాని గోడౌన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టనున్న అధికారులు
పేదలకు చేరాల్సిన బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెపుతున్నాడంటూ వైసీపీనేత, మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. చట్ట ప్రకారం పేర్ని నానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 187 టన్నుల బియ్యం తినేశారని... దీని విలువ రూ. 90 లక్షలు అని చెప్పారు. పేర్ని నాని కుటుంబం మొత్తం పరారీలో ఉందని తెలిపారు. వైసీపీ అంతా దొంగల పార్టీ అనే విషయం అందరికీ అర్థమవుతోందని చెప్పారు.
మరోవైపు, పేర్ని నాని గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయం కావడంపై అధికారులు చర్యలు చేపట్టారు. గోడౌన్ లో ప్రస్తుతం ఉన్న బియ్యాన్ని మచిలీపట్నం మార్కెట్ యార్డ్ కు తరలిస్తున్నారు. 8 లారీల ద్వారా ఒక్కో లారీకి 500 బస్తాలను లోడ్ చేసి తరలిస్తున్నారు. మొత్తం బియ్యాన్ని తరలించిన తర్వాత గోడౌన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టనున్నారు.