Exam Results: వందకు 101 మార్కులు.. ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాల్లో వింత

In Madhya Pradesh Recruitment Exam Candidate Scores 101 Out Of 100

  • మధ్యప్రదేశ్ రిక్రూట్ మెంట్ బోర్డుపై మండిపడుతున్న నిరుద్యోగులు
  • విచారణ జరిపించాలని పట్టుబట్టిన అభ్యర్థులు
  • నార్మలైజేషన్ ప్రక్రియ వల్లేనంటూ అధికారుల వివరణ

పరీక్షలలో వందకు వంద మార్కులు తెచ్చుకునే స్టూడెంట్లను చూసుంటారు.. కానీ మధ్యప్రదేశ్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నిర్వహించిన పరీక్షలో ఓ అభ్యర్థి మాత్రం వందకు 101 మార్కులు తెచ్చుకున్నాడు. ఉద్యోగ నియామక పరీక్షలో వందకు వంద మార్కులు రావడమే అత్యంత అరుదంటే ఓ అభ్యర్థికి 101 మార్కులు రావడంతో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. నియామక పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ భోపాల్ లోని రిక్రూట్ మెంట్ బోర్డ్ ఆఫీసు ముందు నిరసన చేపట్టారు. ఈ విషయంపై పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేసి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంలో కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

జైల్ రిక్రూట్ మెంట్ పరీక్షలో ఘటన..
2023 లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యాన్ అండ్ జైల్ రిక్రూట్ మెంట్ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ఈ పరీక్ష ఫలితాలను వెల్లడించగా.. ఓ అభ్యర్థి 101.66 మార్కులతో టాపర్ గా నిలిచాడు. దీనిపై ఆందోళనలు వ్యక్తం కావడంతో రిక్రూట్ మెంట్ బోర్డ్ వివరణ ఇచ్చింది. నార్మలైజేషన్ ప్రక్రియ వల్లే ఇలా జరిగిందని అధికారులు వివరించారు. నిబంధనల ప్రకారమే ఈ పరీక్షలో నార్మలైజేషన్ ను అమలు చేశామని చెప్పారు. ప్రశ్నాపత్రంలో పొరపాట్లు, సంక్లిష్టత కారణంగా ఏ అభ్యర్థి నష్టపోకుండా వారు సాధించిన మార్కులను నార్మలైజేషన్ చేస్తామని వివరించారు. ఈ ప్రక్రియ కారణంగానే సదరు అభ్యర్థికి 101 మార్కులు వచ్చాయని చెప్పారు.

  • Loading...

More Telugu News