Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి అంబానీ, అదానీ ఔట్!

Ambani and Adani bow out from 100 billion club

  • వ్యాపారాలతోపాటు వ్యక్తిగతంగానూ సవాళ్లు ఎదుర్కొన్న కుబేరులు
  • జులైలో 120 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద ఆ తర్వాత 100 బిలియన్ డాలర్లలోపునకు
  • అదానీ సంపదపై ప్రభావం చూపిన అమెరికా ఆరోపణలు

భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ ఇద్దరూ వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి బయటకు వచ్చేశారు. వారి వ్యాపారాలతోపాటు వ్యక్తిగత సంపద విషయంలోనూ ఇద్దరూ సవాళ్లు ఎదుర్కోవడం వల్లే ఈ క్లబ్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ‘బ్లూమ్‌బర్గ్’ తన కథనంలో పేర్కొంది.

అంబానీ ఎనర్జీ, రిటైల్ వ్యాపారాల ప్రదర్శన అనుకున్నంతగా లేకపోవడం కూడా ఈ క్లబ్ నుంచి బయటకు రావడానికి ఒక కారణమని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. జులైలో అంబానీ సంపద దాదాపు 120.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అంబానీ తన కుమారుడు అనంత్ వివాహానికి దాదాపుగా 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంబానీ ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాంలు, రిటైల్ బ్రాండ్లపై దృష్టి సారించారు. రిటైల్ వ్యాపారంలో ఇటీవల వృద్ధి, లాభాలు మందగించాయి. 

ఇక, అదానీ విషయానికి వస్తే భారతీయ అధికారులకు ముడుపుల వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీ సంపదలో క్షీణత మొదలైంది. జూన్‌లో అదానీ సంపద 122.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, అమెరికా ఆరోపణలు, కేసులు, అంతకుముందు హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా ఆయన సంపద 100 బిలియన్ డాలర్ల లోపునకు పడిపోయింది. 

  • Loading...

More Telugu News