cm chandrababu: పోలవరం ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక ఇది: సీఎం చంద్రబాబు

cm chandrababu naidu releases polavaram project action plan

  • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • పోలవరం ప్రాజెక్టు అథారిటీకి యాక్షన్ ప్లాన్ తెలియజేసినట్లు పేర్కొన్న సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వ బృందం త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తారన్న సీఎం చంద్రబాబు 
  • విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘంతో చర్చించిన తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందన్న సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రధానంగా ఇందులో పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలను నిర్దేశించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం .. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలవరం కార్యాచరణను అధికారులు ప్రకటించారని, ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశామని తెలిపారు.  

జల వనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తారని తెలిపారు. విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘంతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటారని తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందని సీఎం తెలిపారు. 

ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ – 1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ – 2 తో పాటు మిగతా పనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ .. జులై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఫిబ్రవరి 2027 నాటికి పూర్తి చేయగలమని అధికారులు షెడ్యుల్ పెట్టుకున్నప్పటికీ ..2026 జులై నాటికి పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. భూసేకరణ  16 వేల ఎకరాలకు పైగా ఉండగా, 2025 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. 

పోలవరం కుడి కాలువ పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రం వాల్ 2025 జనవరి నుంచి ప్రారంభమై 2026 ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని అంచనాతో ఉన్నప్పటికీ 2025 డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 ఆగస్టు నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కొంత మేర పూర్తవుతుంది కాబట్టి కాపర్ డ్యాం వద్ద నీరు నిలువ చేసి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు ఇచ్చే ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు.  

  • Loading...

More Telugu News