Rohit Sharma: భారీ వైడ్ విసిరిన కొత్త బౌలర్ పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైర‌ల్‌!

Captain Rohit Sharma Fires on Bowler Akash Deep Video goes Viral

  • బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టెస్టు
  • మూడోరోజు ఆట‌లో షాకింగ్ ఘ‌ట‌న‌
  • భారీ వైడ్ వేసిన ఆకాశ్ దీప్‌పై నోరుపారేసుకున్న కెప్టెన్ రోహిత్‌
  • 'బుర్ర ఉందా' అంటూ తిట్టిన వైనం 

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య‌ జ‌రుగుతున్న మూడో టెస్టు.. మూడో రోజు ఆట‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న స‌హ‌నాన్ని కోల్పోయి కొత్త బౌల‌ర్ ఆకాశ్ దీప్‌ను తిట్టిపారేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

అస‌లేం జ‌రిగిందంటే..
ఆసీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆకాశ్ దీప్ 114వ ఓవ‌ర్ వేశాడు. అయితే ఆ ఓవ‌ర్‌లో భారీ వైడ్ విసిరాడు. ఇక కీప‌ర్ రిష‌బ్ పంత్.. త‌న ఎడ‌మ‌వైపు డైవ్ చేస్తూ చాలా క‌ష్టంగా ఆ బంతిని ఆపాడు. ఆఫ్ స్టంప్‌కు చాలా దూరంగా విసిరిన ఆ బాల్‌పై.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 

అంతే.. బౌల‌ర్ ఆకాశ్ దీప్‌ను బుర్ర ఉందా అన్న‌ట్లు తిడుతూ సంజ్ఞ‌ చేశాడు. 'అబే.. స‌ర్ మె కుచ్ హై' అని రోహిత్ తిట్టేశాడు. రోహిత్ మాట్లాడిన ఆ మాట‌ కాస్త .. స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ఆ వీడియో కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అటు కామెంట‌రీ బాక్సులో సైతం జోకులు పేలాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.  

ఇక గ‌బ్బా స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆట నిలిచిపోయే స‌మ‌యానికి రోహిత్ సేన‌ 4 వికెట్ల‌కు 51 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33), రోహిత్ శ‌ర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంత‌కుముందు ఆతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టు త‌న మొద‌టి ఇన్నింగ్స్ లో 445 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆసీస్ కంటే టీమిండియా ఇంకా 394 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉంది. 

  • Loading...

More Telugu News