Google: 2024లో గూగుల్ లో పాకిస్థానీలు భారత్ గురించి సెర్చ్ చేసిన అంశాలు ఇవేనట!

Pakistanis mostly searched items in Google this year is

 


2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్' ట్రెండ్స్ ను విడుదల చేసింది.  ఈ ఏడాది పాకిస్థానీలు భారత్ కు చెందిన ఏ అంశాలపై ఇంటర్నెట్లో ఎక్కువగా వెదికారో ఆ ట్రెండ్స్ ను గూగుల్ పంచుకుంది. వీటిని ఆరు కేటగిరీలుగా విభజించింది. 

క్రికెట్
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్-భారత్ మ్యాచ్, భారత్ వర్సెస్ ఇంగ్లండ్, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ల గురించి పాకిస్థానీలు గూగుల్ లో బాగా సెర్చ్ చేశారట.

ప్రముఖులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ గురించిత తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపించారని గూగుల్ వెల్లడించింది.

సినిమాలు, డిజిటల్ కంటెంట్
భారతీయ సినిమాలకు పాకిస్థాన్ లో పిచ్చ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు పాక్ లో ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో హీరా మండీ, ట్వల్త్ ఫెయిల్ వంటి సినిమాలు... మీర్జాపూర్ సీజన్ 3 వంటి వెబ్ సిరీస్ లు, బిగ్ బాస్-17 వంటి రియాల్టీషోల డీటెయిల్స్ తెలుసుకునేందుకు పాక్ జనాలు గూగుల్ నే ఆశ్రయించారట. 

ఇవే కాకుండా భారత్ లో ఆసక్తికరమై విషయాల గురించి, భారతీయ వంటకాల తయారీ గురించి, ఇండియన్ టెక్నాలజీ గురించి పాకిస్థానీలు బాగా ఆసక్తి చూపించినట్టు గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్-2024 వెల్లడించింది. 

దీన్ని మించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 2024లో భారతీయులు పాకిస్థాన్ కు సంబంధించిన ఏ అంశం గురించి సెర్చ్ చేయలేదట. భారతీయులు ఇంటర్నెట్లో పాకిస్థాన్ విషయాల జోలికే వెళ్లలేదని గూగుల్ వెల్లడించింది. 


  • Loading...

More Telugu News