Ilayaraja: తనకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఇళయరాజా స్పందన

Ilayaraja reacts on news that he was insulted in a temple

  • ఆండాళ్ ఆలయంలో ఇళయరాజాకు అవమానం అంటూ వార్తలు
  • గర్భగుడిలోకి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారని ప్రచారం
  • ఇవన్నీ తప్పుడు వార్తలేనన్న ఇళయరాజా
  • జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం 

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు తమిళనాడులోని ప్రఖ్యాత శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. ఆండాళ్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇళయరాజా గర్భగుడిలోకి వెళుతుండగా, అర్చకులు ఆయనను వెళ్లనివ్వలేదన్నది ఆ వార్తల సారాంశం. దాంతో ఆయన గర్భగుడి బయటినుంచే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. 

ఈ నేపథ్యంలో, ఇళయరాజా స్వయంగా స్పందించారు. "నన్ను కేంద్రబిందువుగా చేసుకుని కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ పుకార్లే. నేను ఎప్పుడూ, ఎక్కడా ఆత్మగౌరవాన్ని వదులుకోను. జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ పుకార్లను అభిమానులు, ప్రజలు నమ్మవద్దు" అని ఇళయరాజా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News