Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 384 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 100 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా పతనమైన టైటాన్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటించారు. దీనికి తోడు ఐటీ, మెటల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపించింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 384 పాయింట్లు నష్టపోయి 81,748కి దిగజారింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,668 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.88గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.28%), బజాజ్ ఫైనాన్స్ (0.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.24%), యాక్సిస్ బ్యాంక్ (0.17%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.12%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-2.04%), అదానీ పోర్ట్స్ (-1.37%), టీసీఎస్ (-1.29%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.29%), ఎన్టీపీసీ (-1.25%).