Venu Swamy: భవిష్యత్తులో అల్లు అర్జున్ కు ఆ యోగం ఉంది: వేణు స్వామి

Allu Arjun becomes CM says Venu Swamy

  • మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి
  • జైలుకు వెళ్లిన వాళ్లందరూ సీఎం అయ్యారని వ్యాఖ్య
  • జగన్ ఎలా సీఎం అయ్యారో అలాగే బన్నీ కూడా సీఎం అవుతారని జోస్యం

ఎప్పుడూ వివాదాల్లో నిలిచే జ్యోతిష్కుడు వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చర్లపల్లి జైల్లో ఒక రాత్రి గడిపిన అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లిన వాళ్లందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారని... కాబట్టి, అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో సీఎం అవుతారని అన్నారు.

జైలుకు వెళ్లిన జగన్ ఏ విధంగా సీఎం అయ్యారో... అదే విధంగా బన్నీ కూడా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. జైలు నుంచి జగన్ ఎంతో కసిగా బయటకు వచ్చారని... దానికంటే 100 రెట్లు ఫైర్ తో అల్లు అర్జున్ బయటకు వచ్చారని అన్నారు. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

  • Loading...

More Telugu News