Prabhas: హీరో ప్రభాస్ కు షూటింగ్ లో గాయం

Prabhas injured in shooting

  • జపాన్ లో వచ్చే నెలలో విడుదల కానున్న కల్కి
  • కొత్త సినిమా షూటింగ్ లో గాయపడిన ప్రభాస్
  • చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడి 
  • కల్కి ప్రమోషన్స్ కు తాను హాజరుకావడంలేదని స్పష్టీకరణ

టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డారు. ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో తన చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడించారు. తాను నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం జపాన్ లో జనవరి 3న రిలీజ్ కానుందని, గాయం కారణంగా తాను ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని క్లారిటీ ఇచ్చారు. గాయం కారణంగా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వివరించారు. ప్రమోషన్ ఈవెంట్స్ లో డిస్ట్రిబ్యూటర్ల బృందం పాల్గొంటుందని తెలిపారు. 

కాగా, ప్రభాస్ కు గాయం కావడం పట్ల అభిమానులు స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

కల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై గణనీయమైన స్థాయిలో వసూళ్లు రాబట్టడం తెలిసిందే. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పుడీ చిత్రాన్ని జపాన్ లోనూ విడుదల చేస్తున్నారు.

Prabhas
Injury
Shooting
Kalki
Japan
Tollywood
  • Loading...

More Telugu News