Chandrababu: జాకీర్ హుసేన్ మృతిపై చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం
- జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమన్న చంద్రబాబు
- సంగీత ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేస్తూనే ఉంటారని వ్యాఖ్య
- సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందన్న నారా లోకేశ్
ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.
భారతీయ శాస్త్రీయ సంగీతంలో మహోన్నత వ్యక్తి అయిన తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. మంత్రముగ్ధులను చేసే ఆయన ప్రదర్శనలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయని కొనియాడారు. ఆయన వారసత్వం రానున్న తరాల్లో సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని పేర్కొంటూ, జాకీర్ హుస్సేన్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజికల్ జీనియస్ ను కోల్పోవడం బాధాకరమని అన్నారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.