Nikhil: బిగ్ బాస్ సీజన్-8 విన్నర్... నిఖిల్

Nikhil emerged as Bigg Boss Telugu Season 8 winner

  • ముగిసిన బిగ్ బాస్ సీజన్-8
  • విజేత నిఖిల్... రన్నరప్ గా గౌతమ్
  • నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

టీవీ నటుడు నిఖిల్ తెలుగు బిగ్ బాస్ సీజన్-8 విజేతగా అవతరించాడు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రూ.55 లక్షల చెక్ ప్రదానం చేశారు. 

బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అందుకున్న నిఖిల్ ఆడియన్స్ కు, ఇతర కంటెస్టెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నట్టు వేదిక పైనుంచి ప్రకటించాడు. 

రామ్ చరణ్ మాట్లాడుతూ, బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య బాండింగ్ బాగుందని, అందరూ విన్నర్లేనని పేర్కొన్నారు. కాగా, నిఖిల్ స్వస్థలం కర్ణాటకలోని మైసూరు. తెలుగు సీరియళ్ల ద్వారా నిఖిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

  • Loading...

More Telugu News