Keerthy Suresh: క్రైస్తవ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్... ఫొటోలు ఇవిగో!

Keerthy Suresh weds Anthony Thattil in christian tredition also

  • తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ చేయందుకున్న కీర్తి సురేశ్
  • ఇటీవల హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి
  • నేడు మరోసారి పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఆంటోనీ తట్టిల్
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న ఫొటోలు

సౌతిండియా బ్యూటీ కీర్తి సురేశ్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ తో ఇటీవల పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీరి పెళ్లి గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. 

తాజాగా, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కూడా కీర్తి సురేశ్, ఆంటోనీ ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కీర్తి, ఆంటోనీ తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు. ఇరు కుటుంబాలకు చెందినవారు, బంధుమిత్రుల కోలాహలం నడుమ వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

  • Loading...

More Telugu News