Megastar: మెగాస్టార్ ఇంటికి ఐకాన్ స్టార్... వీడియో ఇదిగో!

Allu Arjun Went Megastar House For Lunch

  • భార్యతో కలిసి వెళ్లిన అల్లు అర్జున్
  • సంధ్య థియేటర్ ఘటనను వివరించనున్న బన్నీ
  • కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే లంచ్

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు ఏ 11 ముద్దాయిగా పేర్కొన్నారు. ఇటీవల ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపడంతో మధ్యంతర బెయిల్ పై బన్నీ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. 

అరెస్టు వార్త తెలిసిన వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని బన్నీని కలిసేందుకు చిరంజీవి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే, భద్రతా కారణాలరీత్యా చిరంజీవిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో చిరంజీవి అక్కడి నుంచి అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. బన్నీ రిలీజ్ కు సంబంధించి లాయర్లతో సంప్రదింపులు జరుపుతూ కీలకంగా వ్యవహరించారు. 

ఈ క్రమంలోనే జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ తాజాగా ఆదివారం నాడు మెగాస్టార్ నివాసానికి వెళ్లారు. భార్యతో కలిసి మధ్యాహ్నం చిరు ఇంటికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తన అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై బన్నీ చర్చించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మెగాస్టార్ కుటుంబంతో కలిసి లంచ్ చేస్తారని తెలుస్తోంది.

More Telugu News