Sandhya Theatre Stampade: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. వెంటిలేటర్‌పై బాలుడు శ్రీతేజ

Pushpa 2 Sandhya Theatre stampede case Injured 8 year old on ventilator support

  • ఈ నెల 4 సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట
  • రేవతి మృతి, ఆమె 8 ఏళ్ల కుమారుడికి తీవ్ర గాయాలు
  • ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్ ఆసుపత్రిలో చికిత్స
  • అడపాదడపా జ్వరంతో ఇబ్బంది పడుతున్న బాలుడు
  • పైపుల ద్వారా ఆహారం అందజేత

అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ అడపాదడపా జ్వరంతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, ట్యూబుల ద్వారా ఆహారం తీసుకుంటున్నట్టు చెప్పారు. 

కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నటుడు అల్లు అర్జున్‌తోపాటు డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే బాధిత కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇదే కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిలుపై నిన్న విడుదలయ్యారు. అలాగే, సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.

  • Loading...

More Telugu News