Bigg Boss-8: నేడు బిగ్‌బాస్-8కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత

Police alert as Today ends Bigg Boss season 8

  • దాదాపు వంద రోజులపాటు అభిమానులను అలరించిన రియాలిటీ షో
  • నేడు విజేతను ప్రకటించనున్న ‘బిగ్‌బాస్’
  • గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్-8’ సీజన్‌ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ఆడియన్స్‌ను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను నేడు ప్రకటించనున్నారు. గత సీజన్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యగా జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని వెస్ట్ జోన్ పోలీసులు నిర్ణయించారు.

గతేడాది డిసెంబర్ 17న ముగిసిన బిగ్‌బాస్-7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటివి జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News