PV Sindhu: రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు జంట‌.. ఇన్‌స్టాలో ఎంగేజ్‌మెంట్ ఫొటో షేర్ చేసిన క్రీడాకారిణి!

PV Sindhu Gets Engaged Instagram Post With Venkata Datta Sai Goes Viral

  • పోసిడెక్స్ టెక్నాల‌జీస్ ఈడీ వెంక‌ట ద‌త్త‌సాయిని పెళ్లాడానున్న‌ సింధు 
  • ఈ నెల 22న రాజ‌స్థాన్‌లో ఈ జంట వివాహం
  • తాజాగా రింగ్స్ మార్చుకున్న సింధు, వెంక‌ట ద‌త్త‌సాయి  
  • ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సింధు

భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి, తెలుగ‌మ్మాయి పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ ఈడీ వెంక‌ట ద‌త్త‌సాయితో తాజాగా రింగ్స్ మార్చుకున్నారు. దీని తాలూకు ఫొటోను సింధు త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 

'ఒక‌రి ప్రేమ మ‌న‌కు ద‌క్కిన‌ప్పుడు తిరిగి మ‌న‌మూ ప్రేమించాలి' అనే బ్యూటీఫుల్ క్యాప్ష‌న్‌తో ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఆమె షేర్ చేశారు. ఫొటోలో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి సింధు కేక్ క‌ట్ చేయ‌డం కూడా ఉంది. కాగా, ఈ జంట ఈ నెల 22న రాజ‌స్థాన్‌లో పెళ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరువురి కుటుంబాలు పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి. 

View this post on Instagram

A post shared by PV Sindhu (@pvsindhu1)

More Telugu News