Chandrababu: ఆందోళన వద్దు... అల్లు అరవింద్ కు చంద్రబాబు ఫోన్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. చంద్రబాబు... అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఫోన్ చేశారు. జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వద్దని సూచించారు. అల్లు అర్జున్ అరెస్ట్ తో బాధపడుతున్న అరవింద్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తమకు ఫోన్ చేసిన ఏపీ ముఖ్యమంత్రికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు.