India: విదేశాల్లోని భారతీయుల రక్షణ తొలి ప్రాధాన్యత: విదేశాంగ శాఖ

India takes up issue of safety with Ottawa

  • కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్యపై స్పందించిన భారత్
  • భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా కెనడాతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి
  • కెనడాలోని భారతీయుల భద్రతపై శ్రద్ధ తీసుకుంటున్నామన్న విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

విదేశాల్లో ఉన్న భారత పౌరుల రక్షణ కేంద్రానికి తొలి ప్రాధాన్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు. కెనడాలో ఇటీవల ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్యకు గురికావడంపై భారత విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనలపై జైశ్వాల్ మాట్లాడుతూ... ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు.

ఒట్టావాలోని భారత హైకమిషనర్‌తో పాటు టోరంటో, వాంకోవర్‌లలోని కాన్సులేట్‌లను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడి అధికార యంత్రాంగంతో చర్యలు జరుపుతున్నామన్నారు. ఎన్నారైల రక్షణ తమకు ప్రాధాన్యతా అంశమన్నారు. కెనడాలోని భారతీయుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News