Vishnukumar Raju: చంద్రబాబు, పవన్ ఫ్లెక్సీలు పెట్టి ఆక్రమణలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే!
- విశాఖలో అక్రమార్కుల అతి తెలివి
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్న వైనం
- విశాఖలో గ్రీన్‌బెల్ట్ ఆక్రమణలపై సిటీ కమిషనర్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు
- మురళీనగర్ హైవే దగ్గర ఆక్రమణలకు పాల్పడిన మెగా మాల్ యాజమాన్యం
విశాఖపట్నంలో కొందరు అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు విశాఖలో గ్రీన్‌బెల్ట్ ఆక్రమణలపై సిటీ కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. మురళీనగర్ హైవే దగ్గర మెగా మాల్ నిర్మించారు. అయితే, ఆ మాల్ యాజమాన్యం చెట్లను తొలగించి, గ్రీన్‌బెల్ట్‌పై నిర్మాణాలు చేపట్టినట్టు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
అంతేగాక ఆ నిర్మాణాలకు చంద్రబాబు, పవన్‌తో పాటు తన ఫ్లెక్సీలను కూడా పెట్టారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. సిటీ కమిషనర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన జీవీఎంసీ ఆక్రమణలను తొలగిస్తోంది.