Allu Arjun: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా?... ఆయన టీమ్ ఏమన్నదంటే...!

Team Allu Arjun reacts on rumors that Allu Arjun has planned to enter politics soon

  • పుష్ప-2తో బాక్సాఫీసును షేక్ చేస్తున్న అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం
  • అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడంలేదన్న ఆయన టీమ్

టాలీవుడ్ ఐకాన్ స్టార్, రికార్డుల వేటగాడు అల్లు అర్జున్ నెక్ట్స్ స్టెప్ రాజకీయాలేనంటూ కథనాలు వచ్చాయి. ఆయన పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడంలేదని స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. 

అల్లు అర్జున్ కు సంబంధించిన విషయాలు ఏవైనా ఆయన టీమ్ మాత్రమే అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించింది. అల్లు అర్జున్ టీమ్ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 

ఇలాంటి నిరాధారమైన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అల్లు అర్జున్ టీమ్ పేర్కొంది. ఇలాంటి కల్పిత ప్రచారాలకు మీడియా సంస్థలు, ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

More Telugu News