Chandrababu: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెన్షన్... సీఎం చంద్రబాబు ఆదేశాలు

CM Chandrababu orders to disburse pensions to orphan children

  • జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
  • నేడు రెండో రోజున కీలక నిర్ణయం
  • తల్లిదండ్రులు లేని చిన్నారులను మూడు నెలల్లో గుర్తించాలన్న సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెన్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో రెండో రోజు కూడా సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగానే, తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి పట్ల కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించే ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాలని, వారికి నెలనెలా పెన్షన్ అందించాలని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఇలాంటి పిల్లల జాబితాను అప్ డేట్ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News