Indian Railways: రైల్వే శాఖ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందన!

no privatisation of indian Railways railways amendment bill passed in lok sabha

  • రైల్వే సవరణ బిల్లు 2024కు లోక్‌సభ ఆమోదం
  • ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  • బోర్డు స్వతంత్రతను పెంపొందించేందుకే రైల్వే సవరణ బిల్లు అని పేర్కొన్న మంత్రి అశ్విని వైష్ణవ్

రైల్వేలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రైల్వే బోర్డు పని తీరును మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన రైల్వే (సవరణ) బిల్లు – 2024కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. 

ఈ బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ..ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హితవు పలికారు. 

రైల్వే రంగాన్ని మరింత మెరుగుపరచడానికి, బోర్డు స్వతంత్రతను పెంపొందించేందుకు రైల్వే సవరణ బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. రైల్వేలను ఆధునికీకరించడం, పటిష్ఠం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని, రైల్వేల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని ఆయన అన్నారు. రైల్వే సవరణ బిల్లుతో రైల్వే బోర్డు మరిన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతుందని మంత్రి తెలిపారు.  

  • Loading...

More Telugu News