Raghurama Custodial Torture Case: రఘురామ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయపాల్ కు రెండ్రోజుల కస్టడీ
- గత ప్రభుత్వ హయాంలో రఘురామను చిత్రహింసలు పెట్టడంపై కేసు
- ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్
- ఇటీవలే విజయపాల్ అరెస్ట్
- ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైనం
- ఈ నెల13, 14 తేదీల్లో విజయపాల్ కు పోలీసు కస్టడీ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఆయనను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తాజాగా, విజయపాల్ కు కోర్టు రెండ్రోజుల కస్టడీ విధించింది. విజయపాల్ ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13, 14 తేదీల్లో విజయపాల్ ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులకు సూచించింది.