Chandrababu: ఈ నెల 16న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన

CM Chandrababu will visit Polavaram project on Dec 16

  • గతంలో ప్రతి సోమవారం పోలవరం సందర్శించిన చంద్రబాబు
  • ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ
  • కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై ఇంజినీర్లతో మాట్లాడనున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు పోలవరం పర్యటనకు వెళుతున్నారు. డిసెంబరు 16న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గతంలో తాము 2014-19 మధ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి, పనులను సమీక్షించేవారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జూన్ 17న పోలవరం వెళ్లారు. 
 
ఇక, తన తాజా పర్యటన సందర్భంగా... చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మించనుండగా, దానిపై ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News