Donald Trump: 172 దేశాల జీడీపీ కంటే ట్రంప్, మస్క్, వివేక్ రామస్వామి, కార్యవర్గ సభ్యుల ఆస్తులే ఎక్కువట!

Trump assembling US cabinet of billionaires worth combined 340bn

  • ట్రంప్ కార్యవర్గంలోని వారి ఆస్తుల విలువ 382.2 బిలియన్ డాలర్లు
  • ఎలాన్ మస్క్ సంపద 363.2 బిలియన్ డాలర్లు
  • ట్రంప్ ఆస్తులు 6.2 బిలియన్ డాలర్లు

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏది? అంటే అమెరికా అని ఠక్కున చెబుతాం. అలాంటి అమెరికాను ఇప్పుడు పాలిస్తోన్న పాలకులు కూడా చాలామంది అత్యంత ధనికులు కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలో కీలక పదవుల్లో ఉన్న చాలామంది బిలియనీర్లే. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ అధిపతిగా బాధ్యతలు చూస్తున్నారు.

యూఎస్ న్యూస్ సంస్థ ప్రకారం... ఎలాన్ మస్క్ సహా ట్రంప్ కార్యవర్గంలోని వారి ఆస్తుల విలువ 382.2 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.32 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ప్రపంచంలోని 172 దేశాల జీడీపీ కంటే ట్రంప్ కార్యవర్గంలోని బిలియనీర్ల ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయిన సందర్భంలో ఆయన కార్యవర్గంలోని సభ్యుల ఆస్తుల విలువ 6.2 బిలియన్ డాలర్లు మాత్రమే.

రియల్ ఎస్టేట్, హోటల్స్, సోషల్ మీడియా, తదితర వ్యాపారాల్లో ఉన్న ట్రంప్ కూడా కుబేరుడే. డిసెంబర్ 10 నాటికి ఆయన సంపద 6.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 363.3 బిలియన్ డాలర్లు.

యూకే రాయబారిగా ట్రంప్ ప్రతిపాదించిన వారెన్ స్టీఫెన్స్ ఆస్తుల విలువ 3.4 బిలియన్ డాలర్లు. విద్యాశాఖ మంత్రి లిండా‌ మెక్‌మాన్ ఆస్తుల విలువ 3 బిలియన్ డాలర్లు. నాసా అడ్మినిస్ట్రేటర్‌గా ఎంపికైన జరాడ్ ఇస్సాక్‌మెన్ సంపద 1.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ ఆస్తులు 1.5 బిలియన్ డాలర్లు. 

ఎలాన్ మస్క్‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీని నడిపించనున్న వివేక్ రామస్వామి సంపద 1 బిలియన్ డాలర్లు. మిడిల్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి స్టీవెన్ విట్ కాఫ్, అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటీరియర్‌కు నేతృత్వం వహించనున్న డౌగ్ బర్గమ్ ఆస్తుల 1 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి.

  • Loading...

More Telugu News