హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
- పోలీసుల నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్
- సెక్యూరిటీ కోరినా కనీస భద్రత కల్పించలేదని పోలీసులపై ఆరోపణలు
- తన నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటుకు విజ్ఞప్తి
జల్ పల్లిలోని మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ వద్ద మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు.. మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పహాడీ షరీఫ్ పోలీసులు బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నటుడు మోహన్ బాబుకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ కమిషనరేట్ లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.