liquor sales: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు

liquor sales surge in andhra pradesh

  • ఏపీలో ప్రైవేటు వ్యాపారుల ద్వారా మద్యం అమ్మకాలు
  • 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయన్న ఎక్సైజ్ శాఖ
  • 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయని వెల్లడి

ఏపీ వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన తర్వాత కేవలం రెండు నెలలలోపే ఎన్ని కోట్ల రూపాయల మద్యాన్ని మందు బాబులు తాగేశారో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం వ్యాపారానికి స్వస్తి పలికింది. 

గత విధానాన్ని తీసుకువచ్చింది. టెండర్లు పిలిచి లాటరీ పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపుల కేటాయింపు జరిపింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను విడుదల చేసింది. 
 
కేవలం 55 రోజుల్లో 4,677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. 19,33,560 కేసుల బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. తమకు 20 శాతం కమీషన్ ఇవ్వాలని మద్యం దుకాణ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 20 శాతం కమీషన్ ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం విక్రయదారులు పేర్కొంటున్నారు. 

కమీషన్ అంశంపై రాష్ట్రంలో ఓ పక్క చర్చ జరుగుతుండగా, ఎక్సైజ్ శాఖ అధికారులు 55 రోజుల వ్యవధిలో జరిగిన మద్యం అమ్మకాల వివరాలు వెల్లడించారు.  

  • Loading...

More Telugu News