Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన 42వ సీఆర్డీఏ సమావేశం... వివరాలు ఇవిగో!

crda meeting chaired by cm chandrababu

  • వివరాలు వెల్లడించిన మంత్రి పొంగూరు నారాయణ
  • రూ.8,821 కోట్లతో రాజధానిలో పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం
  • ప్రధాన ట్రంక్ రోడ్లను రూ.4,521 కోట్లతో చేపట్టేందుకు అనుమతి

రాజధాని అమరావతిలో రూ.8,821 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం లభించిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 42వ సమావేశం మంగళవారం జరిగింది. 

ఈ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. 2014-19 మధ్య 41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి 5 వేల కోట్ల మేర పనులు పూర్తి చేశామని తెలిపారు. మంగళవారం రోజున రూ.8821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లే అవుట్‌లలో వేసే రోడ్లకు అథారిటీ అనుమతి ఇచ్చిందన్నారు. వీటిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో ఇచ్చిన భూముల్లో రోడ్లకు రూ.3,807కోట్లు, ట్రంకు రోడ్లకు రూ.4,521 కోట్లు, బంగ్లాలకు (జడ్జిలు, మంత్రులు క్వార్టర్స్) రూ.492 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు.

రూ.11,471 కోట్లకు గత అథారిటీ సమావేశంలో అనుమతి ఇచ్చిందని, ఈ రెండు మీటింగ్‌లలో కలిపి మొత్తం రూ. 20,292 కోట్ల 46 లక్షల పనులకు అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్లు రోడ్లు, లేఅవుట్‌లకు అనుమతి లభించిందని పేర్కొన్నారు. ట్రంక్ రోడ్లు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు అనుమతి లభించిందన్నారు. 

2014-19 లో పనులు పూర్తి చేసి ఉంటే చాలా ఖర్చు తగ్గేదన్నారు. అయితే ఆలస్యం అవ్వడం వల్ల రోడ్ల నిర్మాణానికి 25 నుంచి 28 శాతం మేర ధరలు పెరిగాయని మంత్రి వెల్లడించారు. భవనాలకు సంబంధించి 35 నుంచి 55 శాతం మేర ధర పెరిగిందన్నారు. అమరావతిని కొనసాగించి ఉంటే 45 శాతం ధర పెరిగి ఉండేది కాదన్నారు. అదనంగా జీఎస్టీ కూడా 6 శాతం మేర పెరిగిందని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి టెండర్లు పిలుస్తామని, అన్ని టెండర్లను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. 
,

  • Loading...

More Telugu News