Manoj Bajpayee: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి మరో క్రైమ్ థ్రిల్లర్!
- మనోజ్ బాజ్ పాయ్ హీరోగా 'డిస్పాచ్'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్
- అధికారికంగా ప్రకటించిన 'జీ 5'
మనోజ్ బాజ్ పాయ్ .. ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్న ఆర్టిస్టులలో ఆయన ఒకరు. ఒకవైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఆయన నటించిన సినిమాలకు .. సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో ఆయన ఓటీటీ సినిమాలతో మరింతగా దూసుకుపోతున్నారు.
ఆయన నటించిన ఓ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా పేరే 'డిస్పాచ్'. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5 వారు దక్కించుకున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
కొంతకాలం క్రితం దేశంలో అతిపెద్ద స్కామ్ ఒకటి జరిగింది. ఆ నేపథ్యంతో రూపొందిన సినిమా ఇది. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఓ స్కామ్ ను, 'డిస్పాచ్' అనే పత్రికలో పనిచేసే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు బయటికి తీసుకురావాలని అనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.