KTR: వారిపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్ డిమాండ్

KTR demands to dismissal of police who lathi charged on Ahsa workers

  • ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకోవడంపై ఆగ్రహం
  • వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న కేటీఆర్
  • ఆశా వర్కర్లపై దాడి ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడి

ఆశా వర్కర్లపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల తరఫున తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని, కానీ నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారని మండిపడ్డారు. 

కరోనా సమయంలో ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఆశా వర్కర్లు సేవలు అందించారన్నారు. వారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ఆందోళన చేపట్టారన్నారు. ఆశా వర్కర్లపై దాడి ఘటనకు సంబంధించి తాము మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు. 

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.

More Telugu News