all we imagine as light: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన భారతీయ సినిమా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'

all we imagine as light movie nominated for golden globes awards

  • ఇద్దరు నర్సుల కథ ఇతివృత్తంగా పాయల్ కపాడియా రూపొందించిన చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ 
  • ఇప్పటికే పలు వార్డులు సొంతం చేసుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ 
  • రెండు విభాగాల్లో గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డుకు నామినేట్ అయిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ 

ముంబయ్ నర్సింగ్ హోమ్‌లో పని చేసే ఇద్దరు నర్సుల కథతో పాయల్ కపాడియా రూపొందించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకోగా, మరో రికార్డు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకోవడం విశేషం. 
 
బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో ఈ భారతీయ చిత్రం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది.  82వ గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది జనవరి 5న జరగనుండగా, సంబంధిత వివరాలను జ్యూరీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 
 
ఆసియా పసిఫిక్ స్క్రీన్ పురస్కారాల్లో ఐదు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రం.. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గ్రాండ్ ప్రిక్స్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ అవార్డులకు ఇప్పటి వరకూ భారతీయ చిత్రాలు అతి తక్కువ సంఖ్యలో నామినేట్ అయ్యాయి.

బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో ఇంతకు ముందు పోటీ పడిన ఆర్ఆర్ఆర్ చిత్రం .. సాంగ్‌కు అవార్డు దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పొందిన విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News