Ambati Rambabu: మంత్రివ‌ర్గంలోకి నాగ‌బాబు.. 'ప్ర‌భుత్వం అంటే మ‌ల్టీ స్టార‌ర్ మూవీ అనుకుంటున్నారు' అంటూ అంబ‌టి సెటైర్

Ambati Rambabu Satirical Tweet on Nagababu

     


జ‌న‌సేన నేత‌, న‌టుడు నాగ‌బాబును మంత్రివ‌ర్గంలోకి తీసుకోనుండడంపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్ వేశారు. ఈ మేర‌కు ఆయ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ప్ర‌భుత్వం అంటే మ‌ల్టీ స్టార‌ర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం" అని అంబ‌టి ట్వీట్ చేశారు. దీనికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, నాగ‌బాబును ట్యాగ్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఇక గ‌త కొన్నిరోజులుగా నాగ‌బాబు రాజ్య‌స‌భ‌కు వెళతారంటూ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా ఆయనకు రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా నాగబాబు పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. 

  • Loading...

More Telugu News