Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఊరటను కల్పించిన హైకోర్టు
- వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఇంతకు ముందు హైకోర్టు ఆదేశాలు
- రానున్న శుక్రవారం వరకు పాత ఉత్తర్వులే కొనసాగుతాయన్న హైకోర్టు
- వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ ను రేపు విచారించనున్న హైకోర్టు
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు మరోసారి ఊరటను కల్పించింది. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది. రానున్న శుక్రవారం వరకు గత ఆదేశాలను పొడిగించింది.
మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారణ జరపనుంది. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళనను వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకోవైపు వర్మ ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరుకాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వర్మ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అల్లు అర్జున్, 'పుష్ప-2' సినిమా గురించి ఆయన ప్రతిరోజు ట్వీట్లు చేస్తున్నారు.