Samantha: నా కుక్క ప్రేమకు సాటిలేదంటూ సమంత పోస్ట్.. ఆమె పోస్ట్ కు సెటైరా?

Samantha Insta Post About Her Pet Gone Viral

  • పెంపుడు శునకం సాషా ఫొటోను అభిమానులతో పంచుకున్న నటి 
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
  • ఇటీవలే చైతూ ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ట్వీట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తన పెంపుడు శునకం సాషాతో ఇంట్లో కూర్చున్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ సమంత చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోపై ‘సాషా ప్రేమకు ఏదీ సాటిరాదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ పై అభిమానులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. 

సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కు కౌంటర్ గానే సమంత తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిందని, శోభిత పోస్ట్ పై పరోక్షంగా సెటైర్ వేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News