Actress Kasturi: త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు!

Kollywood Actress Kasturi Comments on DMK

  • ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లుగా ఉంద‌న్న క‌స్తూరి
  • కొత్త‌ పార్టీ పెట్టిన న‌టుడు విజ‌య్ ఏ చిహ్నం తీసుకోనున్నారో తెలియ‌ద‌న్న న‌టి
  • తాను జైలుకు వెళ్లిన‌ప్పుడు త‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన సీమాన్‌కు క‌స్తూరి కృత‌జ్ఞ‌త‌లు 

ఇటీవ‌ల తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సినీన‌టి క‌స్తూరి జైలుకు వెళ్లొచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌స్తూరి ఆదివారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కీల‌క పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల‌ను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లుగా ఉంద‌న్నారు. 

ఇక కొత్త‌గా టీవీకే పార్టీ పెట్టిన న‌టుడు విజ‌య్ ఇంకా పార్టీ గుర్తు తీసుకోలేద‌ని, ఆయ‌న ఏ చిహ్నం తీసుకోనున్నారో తెలియ‌ద‌న్నారు. ఓ పార్టీ కూట‌మికి వ్య‌తిరేకంగా అన్నీ పార్టీలు వేర్వేరుగా పోరాడుతున్నాయ‌ని, అవ‌న్నీ ఒకే గొడుగు కిందికి రావాల‌ని క‌స్తూరి అన్నారు. తమ స‌మ‌స్య‌ల‌న్నింటికీ అధికార పార్టీనే కార‌ణ‌మ‌న్న మాన‌సిక‌స్థితికి ప్రజలు వ‌చ్చేశార‌న్నారు. 

ఇక తాను జైలుకు వెళ్లిన‌ప్పుడు త‌న‌కు మ‌ద్ద‌తుగా మొద‌ట మాట్లాడిన వ్య‌క్తి సీమాన్ అని ఆమె పేర్కొన్నారు. అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే, సీమాన్‌ కూడా ఈసారి ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని క‌స్తూరి చెప్పారు.    

  • Loading...

More Telugu News